కేటీపీఎస్‌ 12వ యూనిట్‌లో మళ్లీ సమస్య

ప్రధానాంశాలు

కేటీపీఎస్‌ 12వ యూనిట్‌లో మళ్లీ సమస్య

పాల్వంచ(కేటీపీఎస్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ కేంద్రమైన పాల్వంచ కేటీపీఎస్‌ ఏడో దశ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12వ యూనిట్‌లో మరో రెండో రోజులు విద్యుదుత్పత్తికి అంతరాయం కలగనుంది. శుక్రవారం అర్ధరాత్రి బాయిలర్‌ ట్యూబ్‌ లీకు అయిన విషయం విదితమే. దీనికి మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మళ్లీ కొన్నిగంటలకే అదే సమస్య పునరావృతమైంది. దీన్ని మరమ్మతు చేసేందుకు మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు విద్యుత్తు కోతలతో సతమతమవుతున్నాయి. తెలంగాణలో పెద్దయూనిట్‌ ఇదే కావడంతో రాష్ట్ర గ్రిడ్‌పై భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవిషయమై తాత్కాలిక సీఈ గుర్రం రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. రెండు రోజుల్లో యూనిట్‌ సర్వీస్‌లోకి వస్తుందని చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని