వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం పునరుద్ధరించలేదు: తితిదే

ప్రధానాంశాలు

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం పునరుద్ధరించలేదు: తితిదే

తిరుమల, న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం మార్చి 20 నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని తితిదే తెలిపింది. ఇప్పటికీ కొవిడ్‌ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోందని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో ఈ దర్శనాలను పునరుద్ధరించారని ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. కొవిడ్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దర్శనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని  భక్తులకు తెలియజేస్తామని స్పష్టం చేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని