ఎల్లుండితో వెళ్లిపోనున్న ‘నైరుతి’

ప్రధానాంశాలు

ఎల్లుండితో వెళ్లిపోనున్న ‘నైరుతి’

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో జూన్‌ నెలలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 23న రాష్ట్రం నుంచి, 26న దేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోతాయని వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ‘ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా. ఈ ప్రభావంతో ఉత్తర భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో సాధారణంకన్నా 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోతలు పెరుగుతున్నాయి’ అని వివరించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని