స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరం మనోహర్‌ మృతి

ప్రధానాంశాలు

స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరం మనోహర్‌ మృతి

రామన్నపేట, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వృద్ధుడు వేమవరం మనోహర్‌(102) గురువారం రాత్రి మృతి చెందారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి దశలో ఆర్యసమాజం ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి జైలు శిక్ష అనుభవించారు. నిజాం హయాంలో మత మార్పిడులను వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. పలివెల కేంద్రంగా రహస్య జీవితం గడుపుతూ ఉద్యమాన్ని కొనసాగించారు. వాయిళ్లపల్లి, జనగాం, అశ్వారావుపేట పోరాటాల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక గ్రామ సర్పంచిగా, జడ్పీటీసీ సభ్యునిగా సేవలందించారు. గ్రామంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి 10 ఎకరాలు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మూడున్నర ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అనేక మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు, పలు సంస్థలకు ఆర్థిక సాయం అందించారు. ఆయన కుమారుడు రత్నాకర్‌బాబురావు, కోడలు ప్రసన్న 2003లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో ప్రసన్న ఉమ్మడి నల్గొండ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని