జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు ఘన వీడ్కోలు

ప్రధానాంశాలు

జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు ఘన వీడ్కోలు

ఈనాడు, హైదరాబాద్‌: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌కు గురువారం హైకోర్టు, బార్‌ అసోసియేషన్‌ ఘనంగా వీడ్కోలు పలికాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ నేతృత్వంలో న్యాయమూర్తులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ సేవలను ప్రధాన న్యాయమూర్తితోపాటు, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ ప్రశంసించారు. సీనియర్లతోపాటు యువ న్యాయవాదుల సహకారంతో తన విధులను సంతృప్తికరంగా నిర్వహించినట్లు జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ చెప్పారు. తనకు సహకరించిన సిబ్బందితో సహా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ నేతృత్వంలో సభ్యులు.. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ దంపతులను సన్మానించి ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశారు. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని