దళితబంధు పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రధానాంశాలు

దళితబంధు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకాన్ని వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఈనెల 25కి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపించబోగా ఇదే అంశానికి సంబంధించి మరో రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయవాదులు చెప్పారు. ఈ క్రమంలో ధర్మాసనం అన్నింటినీ కలిపి సోమవారం విచారిస్తామంటూ ప్రక్రియను వాయిదా వేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని