వర్సిటీల్లో ప్రవేశాలకు 24 నుంచి రిజిస్ట్రేషన్లు

ప్రధానాంశాలు

వర్సిటీల్లో ప్రవేశాలకు 24 నుంచి రిజిస్ట్రేషన్లు

లాలాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు, 27 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొ.పాండు రంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 7 విశ్వవిద్యాలయాల్లో 41 వేల పీజీ సీట్లు ఉన్నాయని, వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో మరో 4 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. విద్యార్థులు వెబ్‌ఆప్షన్ల ఎంపికలో నిబంధనలు పాటించాలని సూచించారు. అర్హత చూసుకోకుండా ఆప్షన్లు ఎంచుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడాలని కోరారు. సమావేశంలో ఓయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా.టి.గంగాధర్‌, డా.ప్యాట్రిక్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని