వరవరరావుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ప్రధానాంశాలు

వరవరరావుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

బెంగళూరు, న్యూస్‌టుడేే:  ఓ కేసులో విచారణకు హాజరుకానందుకు విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావుకు కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీచేసింది. 2005లో తుమకూరులో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సమయంలో పోలీసులపై జరిగిన దాడులకు ప్రజా కవి గద్దర్‌తో కలిసి నేతృత్వం వహించారనే ఆరోపణల నేపథ్యంలో వరవరరావుపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి శనివారం విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు జామీను రహిత వారెంటు జారీచేసింది. ఇటీవల వరకు పుణె జైలులో ఉన్న వరవరరావు అనారోగ్యం బారిన పడటంతో, ముంబయిలో ఉంటూ చికిత్స పొందేందుకు అక్కడి కోర్టు అనుమతించింది. ముంబయి దాటి వెళ్లకూడదని ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణకు హాజరు కాలేకపోయారని వరవరరావు తరఫు న్యాయవాది తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని