బడుల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని రేపు నిరసన

ప్రధానాంశాలు

బడుల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని రేపు నిరసన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించనందుకు నిరసనగా ఈ నెల 25న ప్రతి బడి ఆవరణలో ఉపాధ్యాయులతో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. స్వచ్ఛ కార్మికులను నియమించాలని కోరుతూ 25న తహసీల్దార్లకు, 26, 27 తేదీల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని సంఘం తీర్మానించిందని తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని