ధరణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: సీఎస్‌

ప్రధానాంశాలు

ధరణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో పలు సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 10.35 లక్షలకుపైగా స్లాట్లు నమోదయ్యాయన్నారు. శనివారం బీఆర్కే భవనంలో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎస్‌ మాట్లాడారు. ధరణి సేవలను మరింత సులభతరం చేసేందుకు, దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని