కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు

ప్రధానాంశాలు

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు

నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం రూపొందించిన 3 కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్‌ చెప్పారు. వీటితో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో గానీ, మద్దతు ధరలకు పంటలను కొనడంలో గానీ జోక్యం కల్పించుకోబోదని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడి జాతీయ మెట్టపంటల పరిశోధనా కేంద్రం (క్రిడా)లో కొత్త చట్టాలపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్న రమేశ్‌చంద్‌ మాట్లాడుతూ.. ఈ చట్టాలు తీసుకురావడానికి చాలాకాలం ముందే రైతులు, రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలతో కేంద్రం చర్చించిందన్నారు. వీటి వల్ల ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్లకు తోడు కొత్త మార్కెట్లు, అదనపు పెట్టుబడులు వస్తాయని, మార్కెట్‌ రుసుం తగ్గుతుందని వివరించారు. సామాజిక, ఆర్థిక అధ్యయనాల కేంద్రం (సెస్‌) సంచాలకురాలు ఇ.రేవతి మాట్లాడుతూ.. చిన్న రైతులకు మేలు కలిగేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త చట్టాలతో రైతులకు ఆదాయం పెరుగుతుందని క్రిడా సంచాలకుడు వీకే సింగ్‌ పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని