రుసుములు భరిస్తాం.. ఖర్చులు చెల్లిస్తాం..

ప్రధానాంశాలు

రుసుములు భరిస్తాం.. ఖర్చులు చెల్లిస్తాం..

 ఐఐటీ ఖరగ్‌పుర్‌ బాటలోనే కాన్పుర్‌, గాంధీనగర్‌

అడ్వాన్స్‌డ్‌ మెరికలకు నజరానాలు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ఆకర్షించేందుకు ఐఐటీలు పోటీ పడుతున్నాయి. వారికి పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌లు ప్రకటిస్తున్నాయి. నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజులతోపాటు మిగిలిన ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని చెబుతున్నాయి. తమ సంస్థలో చేరే 100 లోపు ర్యాంకుల వారికి ఫీజులు, ఇతర ఖర్చులు భరిస్తామని ఇటీవల ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఐఐటీ గాంధీనగర్‌ (గుజరాత్‌), ఐఐటీ కాన్పుర్‌ కూడా అలాంటి నజరానాలనే ప్రకటించాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వంద లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ విద్యాసంస్థల్లో చేరితే ట్యూషన్‌, హాస్టల్‌ ఫీజులు భరిస్తామని, బ్రైట్‌ మైండ్స్‌ స్కాలర్‌షిప్‌ పేరిట పుస్తకాలు, ఇతర ఖర్చులకు డబ్బులు చెల్లిస్తామని ఐఐటీ కాన్పుర్‌ ప్రకటించింది. ఆ సంస్థలో బీటెక్‌ వార్షిక రుసుం రూ.2.16 లక్షలు ఉంది. ఈ ఫీజును మినహాయించడంతోపాటు ప్రతినెలా వ్యక్తిగత ఖర్చులకు డబ్బులు చెల్లిస్తామని తెలిపింది. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలలోపు ఉండాలని ఐఐటీ ఖరగ్‌పుర్‌ తరహాలోనే షరతు విధించింది. ఇదిలా ఉండగా.. తమ సంస్థలో చేరే వెయ్యి లోపు ర్యాంకర్లకు ట్యూషన్‌ ఫీజును నాలుగేళ్లపాటు మెరిట్‌ స్కాలర్‌షిప్‌గా ఇస్తామని ఐఐటీ గాంధీనగర్‌ ప్రకటించింది. ఆ సంస్థలో ట్యూషన్‌ రుసుం ఏడాదికి రూ.2 లక్షలు ఉంది. ఈ లెక్కన వెయ్యి లోపు ర్యాంకర్లకు నాలుగేళ్లలో రూ.8 లక్షలు చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి లోపు ర్యాంకర్లు దాదాపు 275 మంది వరకు ఉంటారని అంచనా. ఇప్పటికే ప్రారంభమైన జోసా కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు.
కోర్టు ధిక్కరణ అప్పీళ్లతో పాటు రిట్‌ అప్పీళ్లను కలిపి విచారణ చేపడతామంటూ తదుపరి విచారణను నవంబరు ఒకటికి వాయిదా వేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని