500 కిసాన్‌రైళ్లు నడిపిన ద.మ.రైల్వే

ప్రధానాంశాలు

500 కిసాన్‌రైళ్లు నడిపిన ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: జోన్‌ పరిధి నుంచి 500 కిసాన్‌ రైళ్లను నడిపించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి 1.6 లక్షల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తులు తూర్పు, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అయ్యాయి. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కిసాన్‌ రైళ్లను ప్రకటించారు. వాటిలో పంపే సాగు ఉత్పత్తులకు రవాణా ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తుండటంతో ఈ బండ్లకు ఆదరణ లభిస్తోంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని