27 నుంచి మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన

ప్రధానాంశాలు

27 నుంచి మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27న బయల్దేరి వెళ్లే ఆయన వచ్చే నెల ఒకటో తేదీ వరకు అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో కేటీఆర్‌ వెంట పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇతర అధికారులుంటారు. ఈనెల 29న రాజధాని పారిస్‌లో తమ దేశ సెనేట్‌లో జరిగే భారత ఆశయ వాణిజ్య వేదిక (ఆంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం) సమావేశానికి హాజరై కరోనా అనంతర పరిస్థితుల్లో ‘భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాల వృద్ధి, భవిష్యత్తు రూపకల్పన’ అనే అంశంపై ప్రసంగించాలని ఫోరం కేటీఆర్‌ను కోరింది. 700 మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 400కు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాన్ని కేటీఆర్‌ కీలకంగా భావించి, పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ఇతర అనుకూలతలను తెలియజేసి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని