కర్నూలు జిల్లాలో కృష్ణా బోర్డు బృందం పర్యటన

ప్రధానాంశాలు

కర్నూలు జిల్లాలో కృష్ణా బోర్డు బృందం పర్యటన

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ఏపీలోని రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు బోర్డు ప్రతినిధుల బృందం సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించింది. నందికొట్కూరు నియోజకవర్గంలో కృష్ణా నదిపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ పథకాలను సందర్శించింది. జలవివాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నది నీటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని సూచించినా రెండు రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు కృష్ణా బోర్డు కార్యదర్శి దివాకర్‌ రాయిపురే నేతృత్వంలో బృందం సోమవారం పర్యటించింది. ప్రాజెక్టులకు సంబంధించిన స్థలాలు, మ్యాప్‌లు మొత్తం బోర్డుకు అప్పగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని