వాతావరణ విపత్తుల ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు అధికం

ప్రధానాంశాలు

వాతావరణ విపత్తుల ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు అధికం

ఖమ్మం జిల్లాకూ ఎక్కువే  
సీఈఈడబ్ల్యూ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: వరదలు, కరవులు, తుపాన్లు వంటి విపత్తుల ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువని దిల్లీకి చెందిన మేధో మథన సంస్థ ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరానిమెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) అధ్యయనంలో వెల్లడైంది. అస్సాం, బిహార్‌, కర్ణాటక, మహారాష్ట్రలకూ ఈ ఇబ్బంది ఉందని తేలింది. వాతావరణ సంబంధ విపత్తులు ఎక్కువగా ఎదురయ్యే జిల్లాల్లోనే 80 శాతం మంది భారతీయులు ఉంటున్నారని అధ్యయనం పేర్కొంది. దీని ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, తెలంగాణలో ఖమ్మం, తమిళనాడులో చెన్నై, ఒడిశాలో గజపతి, మహారాష్ట్రలో సాంగ్లి, అస్సాంలో ధెమాజీ, నగావ్‌ జిల్లాలకు ఈ వైపరీత్యాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి.

దేశంలో 463 జిల్లాలు తీవ్ర వరదలు, కరవులు, తుపాన్ల ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిలో దాదాపు 45 శాతం జిల్లాల్లో పర్యావరణానికి హాని కలిగించేలా నేల తీరుతెన్నుల్లో మార్పులు జరిగాయి.

183 ‘హాట్‌స్పాట్‌ జిల్లాల’కు ఒకటి కన్నా ఎక్కువగా విపత్తుల ముప్పు పొంచి ఉన్నాయి.  

2005తో పోలిస్తే అసాధారణ వాతావరణ ఘటనల తీవ్రత దాదాపు 200 శాతం పెరిగింది.

దక్షిణ, మధ్య ప్రాంతంలోని రాష్ట్రాలకు తీవ్ర కరవుల ప్రమాదం అధికం. ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు ఎక్కువ.

తూర్పు రాష్ట్రాల్లోని 59 శాతం జిల్లాలు, పశ్చిమ రాష్ట్రాల్లోని 41 శాతం జిల్లాలకు తీవ్రస్థాయి తుపాన్ల ప్రమాదం ఎక్కువ.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని