వందశాతం కరోనా టీకాలివ్వాలి: సీఎస్‌

ప్రధానాంశాలు

వందశాతం కరోనా టీకాలివ్వాలి: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా టీకాల లక్ష్యాన్ని వందశాతం సాధించాలని, దీని కోసం క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు కేవలం రెండు డోసులు టీకాలు తీసుకోవడమే ఏకైక మార్గమని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌, బ్రెజిల్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ తదితర దేశాలతో పాటు చైనాలో కరోనా వైరస్‌ మరో రూపంలో తిరిగి ప్రబలిందని, ప్రజలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా టీకాల కార్యక్రమంపై మంగళవారం ఆయన బీఆర్‌కే భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పురపాలకవార్డుల్లో టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని సీఎస్‌ ఆదేశించారు. టీకా డోసులు, సిరంజీల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. మరోపక్క నిఘా (విజిలెన్స్‌)  చైతన్య వారోత్సవాలను పురస్కరించుకొని బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ నిర్వహించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని