నదుల అనుసంధానంపైసమావేశం వాయిదా

ప్రధానాంశాలు

నదుల అనుసంధానంపైసమావేశం వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: నదుల అనుసంధానంపై రేపు (ఈ నెల 28న) జరగాల్సిన 35వ జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన వివిధ రాష్ట్రాలు సభ్యులుగా ఉన్న ప్రత్యేక కమిటీ అనుసంధాన ప్రక్రియపై ఆన్‌లైన్‌లో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశం వాయిదా పడిందని, తదుపరి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ సభ్య కార్యదర్శి భూపాల్‌ సింగ్‌ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని