యాదగిరిగుట్టలో ధ్వజస్తంభ ప్రతిష్ఠకు సన్నాహాలు

ప్రధానాంశాలు

యాదగిరిగుట్టలో ధ్వజస్తంభ ప్రతిష్ఠకు సన్నాహాలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రీశుని పుణ్యక్షేత్రంలో ధ్వజస్తంభం, కలశాల ప్రతిష్ఠకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయినందున మహాకుంభ సంప్రోక్షణ జరిపేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటికే 54 అడుగుల పొడవైన కర్రను ఆదిలాబాద్‌ అడవుల నుంచి తెచ్చి ధ్వజస్తంభంగా మలిచారు. దీని స్థాపనకు గర్భాలయం ఎదుట పడమటి దిశలో బలిపీఠం చెంత సన్నాహాలు చేపట్టారు. ప్రధాన ఆలయం నలువైపులా కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజి మండప ప్రాకారాలపై ఉన్న విమానం(గోపురాల)పై కలశాలను ప్రతిష్ఠించేందుకు పనులను వేగవంతం చేసినట్లు యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని