న్యాక్‌ రాష్ట్ర నివేదిక విడుదల

ప్రధానాంశాలు

న్యాక్‌ రాష్ట్ర నివేదిక విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలపై విశ్లేషణ అనే పేరిట జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌) రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై మంగళవారం బెంగళూరులోని న్యాక్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా నాణ్యత పెంచేందుకు అవసరమైన భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో న్యాక్‌ సంచాలకుడు ఎస్‌సీ శర్మ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి.వెంకట రమణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని