వర్సిటీల్లో నూతన ఆవిష్కరణలు పెరగాలి

ప్రధానాంశాలు

వర్సిటీల్లో నూతన ఆవిష్కరణలు పెరగాలి

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి


సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. పక్కన రాష్ట్ర శాస్త్ర, సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌,

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆశించిన స్థాయిలో నూతన ఆవిష్కరణలు జరగట్లేదని, వ్యవస్థలోని లోపాల్ని సవరించాల్సిన అవసరం ఉందని, శాస్త్రవేత్తలు ఈ విషయమై దృష్టి సారించాలని అటవీ, శాస్త్రసాంకేతికశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి(టీఎస్‌ కాస్ట్‌) కార్యనిర్వాహక సమావేశం మంగళవారమిక్కడ అరణ్యభవన్‌లో జరిగింది. శాస్త్రసాంకేతిక రంగాల ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. పాఠశాల స్థాయి నుంచి సైన్స్‌ బోధనను, మౌలిక సదుపాయాల్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ, విద్యాపరిశోధన, శిక్షణ మండలితో సమన్వయం చేసుకోవాలని టీఎస్‌ కాస్ట్‌కు మంత్రి సూచించారు. వ్యవసాయ, పర్యావరణ, సహజవనరుల నిర్వహణలో పరిశోధనలు చేసే విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర శాస్త్ర, సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎస్‌ కాస్ట్‌ సభ్యకార్యదర్శి ఎం.నగేశ్‌, కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ శాస్త్రవేత్త రష్మి, ఉత్తర్‌ప్రదేశ్‌ శాస్త్రసాంకేతిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్‌ గంగ్వార్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని