తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ

ప్రధానాంశాలు

తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో ఫిక్సెడ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీల) కుంభకోణంపై సమగ్ర విచారణ బాధ్యతను ప్రభుత్వం రాష్ట్ర ఆడిట్‌ శాఖకు అప్పగించింది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన రూ.64.5 కోట్ల ఎఫ్‌డీల కుంభకోణంలో ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభకోణానికి దారితీసిన పరిస్థితులు, తెలుగు అకాడమీలో సంస్థాగతంగా ఉన్న లోపాలతో పాటు వివిధ అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆడిట్‌శాఖను ఆదేశించింది. డిపాజిట్లను స్వాహా చేసేందుకు అనుకూలించిన పరిస్థితులతో పాటు తనిఖీ విభాగాల వైఫల్యాలు, ఆర్థిక అంశాలను ఆడిట్‌ శాఖ సమగ్రంగా పరిశీలించనుంది. సంస్థలో గత కొన్నేళ్లుగా జరిగిన ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్‌ చేయనున్నారని తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని