అమ్మా.. మా చేలోకి రండి!

ప్రధానాంశాలు

అమ్మా.. మా చేలోకి రండి!

చిత్రాలను చూసి ప్రయాణికులు ఆటోను ఆపుతున్నారనుకుంటే పొరపాటు పడ్డట్టే. పత్తిని ఏరడానికి కూలీల కోసం రైతన్నలు పడుతున్న ప్రయాస ఇది. పండిన పత్తి చేలల్లో ఉంది. ఒక వైపు వర్షం వస్తుందేమోననే భయం.. మరోవైపు రోజూ కురుస్తున్న మంచు కర్షకులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే వారితో పాటు ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి పత్తి ఏరేందుకు ఆటోల్లో వస్తున్న కూలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు రైతులు ముందుగానే ఆటో డ్రైవర్లతో మాట్లాడుకొని కూలీలను రప్పించుకుంటే.. మరికొందరు ఆటోడ్రైవర్లు మధ్యవర్తిత్వం చేసి తెచ్చుకున్న కూలీల కోసం రహదారులపై పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతులు ఉదయాన్నే రోడ్డు పక్కన నిలబడి కూలీలతో వెళ్తున్న ఆటోలను ఆపి తమ చేలో పనికి రావాలని బతిమాలుకుంటున్నారు. కిలో పత్తి ఏరడానికి రూ.8 చొప్పున ఇస్తామంటూ పోటీపడుతున్నారు. ఈ పరిస్థితి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉంది.

- ఈనాడు, ఆదిలాబాద్‌
- న్యూస్‌టుడే, తాంసి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని