పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం

ప్రధానాంశాలు

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం

ఇదే సీఎం లక్ష్యం
మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడి

సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యమందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమనీ, అందులో భాగంగానే కొత్తగా వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ, హైదరాబాద్‌ నగరం నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను, రాష్ట్రవ్యాప్తంగా 8 వైద్యకళాశాలలను, 14 నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో కొత్త ఆసుపత్రులు, వైద్య, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. నిర్మాణ డిజైన్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా డిజైన్లలో స్వల్ప మార్పులను సూచించారు. తర్వాతి సమావేశం నాటికి డిజైన్ల ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ మనోహర్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి, సీఈ రాజేందర్‌, వాస్తు నిపుణులు సుధాకర్‌ తేజ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని