నవంబరు నుంచి తునికాకు సేకరణ

ప్రధానాంశాలు

నవంబరు నుంచి తునికాకు సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: తునికాకు సేకరణ సీజన్‌ని ముందస్తుగా మొదలుపెట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. నవంబరు నెల నుంచే తునికాకు సేకరణ ప్రారంభమవుతుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బీడీ లీఫ్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 242 తునికాకు యూనిట్లను ఆన్‌లైన్‌లో వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. తునికాకు సేకరించే గుత్తేదారులే అటవీ ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్ల కోసం ఫైర్‌ వాచర్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు సిద్దానంద్‌ కుక్రేటి, ఏకే సిన్హా, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోదన్‌కుమార్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ సర్కిళ్ల చీఫ్‌ కన్జర్వేటర్లు రామలింగం, ఆశ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని