పోడు అర్జీలపై అవగాహన కల్పించండి: సీఎస్‌

ప్రధానాంశాలు

పోడు అర్జీలపై అవగాహన కల్పించండి: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి వచ్చే నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, దీనిపై సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, అటవీ సంరక్షణ కమిటీల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పోడు సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. మొత్తం పారదర్శకంగా, ఏమాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. బుధవారం ఆయన బీఆర్‌కే భవన్‌లో అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, రెవెన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్ఘీస్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘పోడు దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందుపరిచే అంశాలు, విధివిధానాలపై గిరిజనులకు తెలియజెప్పాలి. డివిజన్‌, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాలకు సీనియర్‌ అటవీ అధికారులను నియమించాలి’’ అని సీఎస్‌ వారికి సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని