తేమ ఎక్కువగా ఉందని అమ్మిన ధాన్యం వెనక్కి!

ప్రధానాంశాలు

తేమ ఎక్కువగా ఉందని అమ్మిన ధాన్యం వెనక్కి!

కరీంనగర్‌ జిల్లాలో తిప్పిపంపిన మిల్లులు


లారీలోని సంచుల నుంచి ధాన్యాన్ని కేంద్రంలో పోస్తున్న హమాలీలు

గంగాధర, న్యూస్‌టుడే: హమ్మయ్య..ఎట్టకేలకు ధాన్యం అమ్ముకోగలిగామన్న రైతన్న ఆనందం అంతలోనే ఆవిరయింది. తూకం వేసి మిల్లులకు పంపిన ధాన్యం మిల్లుల నుంచి అయిదు రోజుల తర్వాత తిరిగి వెనక్కి రావడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలోని ప్యాక్స్‌ కేంద్రంలో ఈ నెల 19న తూకం వేసి 20న పంపించిన ధాన్యం బస్తాలు బుధవారం మిల్లుల నుంచి వెనక్కి వచ్చాయి. కేంద్రంలో 20 రోజులపాటు వరి ధాన్యం ఆరబెట్టి, శుభ్రం చేసి మూడు లారీల్లో మిల్లులకు పంపించగా ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని తాడికల్‌ మిల్లు నుంచి 2 లారీలు, అల్గునూర్‌ నుంచి ఒక లారీ ధాన్యాన్ని కేంద్రానికి తిప్పి పంపించారు. కేంద్రంలో కొనుగోలుకు ముందే ధాన్యం తేమను కొలిచి పంపించారని... అక్కడికి వెళ్లాక వాతావరణ పరిస్థితుల వల్ల తేమశాతం పెరిగి ఉండవచ్చని అన్నదాతలు అంటున్నారు. ఒక్కో లారీలో 850 బస్తాల చొప్పున 2550 బస్తాల ధాన్యం వెనక్కి రాగా హమాలీలు సంచుల నుంచి ధాన్యాన్ని కింద పోశారు. హమాలీ ఛార్జీలతోపాటు ధాన్యం ఆరబెట్టి, మరోసారి తూకం వేసేందుకు అయ్యే అదనపు భారం తమపైనే పడుతుందని రైతులు వాపోతున్నారు. 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని