TS News: కారులో కాళ్ల వద్దే పాము.. అలాగే 50 కిలోమీటర్ల ప్రయాణం

ప్రధానాంశాలు

TS News: కారులో కాళ్ల వద్దే పాము.. అలాగే 50 కిలోమీటర్ల ప్రయాణం

కారులో దూరిన సర్పాన్ని బయటకు లాగుతున్న పాములు పట్టే వ్యక్తి

ఎదులాపురం, న్యూస్‌టుడే: పామును చూస్తేనే చాలామందికి భయం. అలాంటిది దాంతో పాటే 50 కిలో మీటర్లు ప్రయాణం చేయడమంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఉట్నూర్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ మరో ఇద్దరితో కలిసి అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు కారులో బయలుదేరారు. ఆదిలాబాద్‌ సమీపంలోకి వచ్చిన అనంతరం కాళ్ల వద్ద పాము కనిపించటంతో ప్రాణభయంతో వారంతా కారు నుంచి దిగి పరిగెత్తారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించటంతో ఆయన కారులో దూరిన పామును అతికష్టమ్మీద బయటకు తీశారు.  

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని