close

ప్రధానాంశాలు

సాగులో నష్టం తగ్గించే పరిశోధనలు అవసరం

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించే పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎస్‌డీసీ గవర్నెన్స్‌ టువర్డ్స్‌ బిల్డింగ్‌ ఆన్‌ అగ్రికల్చర్‌-రూరల్‌ సెంట్రిక్‌ ఎకానమీ’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేని అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సీజీజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జువ్వాడి దేవీప్రసాద్‌రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ డైరెక్టర్‌ రత్నాకర్‌, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ ఉపాధ్యక్షుడు జీవీ సుబ్బారెడ్డి, ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త జీవీ రంగారెడ్డి, విదేశీ ప్రతినిధులు వైకేల్‌ లివ్‌, ఫాతిమా జూర పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.