close

ప్రధానాంశాలు

పంట చేలల్లో సెన్సర్లు

వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులతో పంటలకు తెగుళ్లు వ్యాపించి రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట చేలల్లో వైర్‌లెస్‌ సెన్సార్‌ పరికరాలను ఏర్పాటుచేసి అక్కడి ఉష్ణోగ్రత వివరాలను, తేమశాతాన్ని విశ్లేషించి పంటకు ఆశించే తెగులును ముందే అంచనా వేసేందుకు ‘భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ’ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. తద్వారా ఏ తెగులుకు ఏ పురుగుమందులను వాడాలో రైతులకు సూచిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కనిమెట్ట, గుడిగండ్ల, ఉంద్యాల గ్రామాలలో సుమారు 250 ఎకరాల్లోని ఆముదం చేలల్లో వైర్‌లెస్‌ సెన్సార్‌ పరికరాలను ఏర్పాటు చేశారు. 2017 నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, మెరుగైన ఫలితాలు వస్తుండటంతో చాలామంది రైతులు తమ చేలల్లోనూ సెన్సార్‌ పరికరాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నారని హైదరాబాద్‌లోని పరిశోధన సంస్థకు చెందిన రావులపల్లి ప్రసాద్‌ తెలిపారు.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.