close

ప్రధానాంశాలు

పండగ పూటా పోరుబాటే

 అమరావతి ప్రాంతంలో 28వ రోజూ కొనసాగిన నిరసన దీక్షలు

ఈనాడు, అమరావతి: సంక్రాంతి సంబరాలు అమరావతి ప్రాంతంలో నిరసనలతో ప్రారంభమయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడంలో దీక్షా శిబిరాల ముందు మంగళవారం వేకువజామునే భోగి మంటలు వేశారు. ‘సేవ్‌ అమరావతి..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంటూ రంగువల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటల్లో జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ నివేదిక ప్రతులను తగలబెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, రైతులందరూ పాల్గొన్నారు. ఇంట్లో వంట చేయకుండానే పండగరోజు దీక్షల్లో పాల్గొని వంటావార్పులో చేసిన వడ్డించిన భోజనాలే చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధి చేసినప్పుడే నిజమైన పండుగని తెలిపారు. దీక్షా కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ హాజరయ్యారు. శిబిరాలకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న, న్యాయవాది గొట్టిపాటి శివరామకృష్ణ తదితరులు సంఘీభావాన్ని తెలిపారు.

అందరితో చర్చించి నిర్ణయం
రాజధాని రైతులు వారి ప్రతిపాదనలను సీఆర్‌డీఏకు అందించవచ్చని హైపవర్‌ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో కలిసి చర్చించుకోవాలని రైతులు నిర్ణయించారు. రాజధాని గ్రామాల రైతుల ఐకాసలన్ని కలిసి సమావేశమై ఏం చేయాలనే దానిపై నిర్ణయించేవరకు ప్రతిపాదనలివ్వడానికి సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బుధవారం సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. శాంతియుత నిరసనలకు పోలీసుల అడ్డంకులపై డీజీపీ గౌతంసవాంగ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిసి సమస్యలను విన్నవించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని జ్ఞమూడు రోజులపాటు ఉద్ధృతంగా నిరసనలు నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి(ఐకాస) కన్వీనర్‌ ఎ.శివారెడ్డి తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.