close

ప్రధానాంశాలు

పాత్రికేయ వృత్తిలోకి 20 మంది ట్రాన్స్‌జెండర్లు

తిరుపతి, న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు పాత్రికేయ వృత్తిని చేపట్టనున్నారు.  హైదరాబాద్‌కు చెందిన సయోధ్య సంస్థ... 20 మంది ట్రాన్స్‌జెండర్లకు రెండు నెలల పాటు తిరుపతిలోని మహిళా ప్రాంగణంలో మీడియా రంగానికి అవసరమైన అన్ని విభాగాల్లో శిక్షణ అందించింది. ఈ కార్యక్రమం మంగళవారం శిక్షణ ముగిసింది. ఆ సందర్భంగా సమావేశం నిర్వహించారు. దీనికి అతిథులుగా నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ సంచాలకుడు రామకృష్ణన్‌, సయోధ్య సంస్థ సీఈవో వి.మృదుల, సరిత, మధు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్‌జెండర్లకు మరో నెల పాటు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత వారు పాత్రికేయ వృత్తిని చేపట్టనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.