close

ప్రధానాంశాలు

తెలంగాణకు జాతీయ ఇ-పరిపాలన పురస్కారం

వచ్చే నెల ఏడో తేదీన ముంబయిలో ప్రదానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ బ్లాక్‌చెయిన్‌ ప్రాజెక్టును దిల్లీలోని జాతీయ ఇ-పరిపాలన మండలి నూతన సాంకేతికత విభాగంలో మొదటి స్థానానికి ఎంపిక చేసింది. వచ్చే నెల ఏడో తేదీన ముంబయిలో జరిగే కార్యక్రమంలో స్వర్ణ పతకాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేయనుంది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఇ-పరిపాలన మండలి శుక్రవారం సమాచారం అందించింది. విలువైన, రహస్యమైన సమాచారాన్ని ఇతరులు తస్కరించకుండా సాంకేతిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన బ్లాక్‌చెయిన్‌ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని ఇప్పటికే నిరూపించిందని ఈ సందర్భంగా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ వెల్లడించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.