close

ప్రధానాంశాలు

అభిమానుల పోటీ.. కడియం లూటీ

ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. సెల్ఫీల ముచ్చట ముగిశాక చూసుకుంటే.. మంత్రి చేతికి ఉండే బంగారు కడియం మాయమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో గురువారం సాయంత్రం మంత్రి ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడ అభిమానులతో ఫొటోలు దిగే సమయంలో ఆయన చేతి కడియాన్ని ఎవరో తస్కరించారు. ఈ ఆభరణం మంత్రి గారి సెంటిమెంటు అన్నది ఆయన అనుచరులు చెప్పేమాట. దీంతో అక్కడే ఉన్న పోలీసులను, అంగరక్షకులను తిట్టిపోశారు. ఏం చేస్తారో నాకు తెలియదు.. ఆ కడియం కావాల్సిందే అని హుకుం జారీ చేశారు. బిత్తరపోయిన పోలీసులు ‘బాబ్బాబూ! ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి, మిమ్మల్ని ఏమీ అనం’ అంటూ కార్యకర్తలను బతిమాలుకోవడం మొదలుపెట్టారు.

- న్యూస్‌టుడే, దేవరకద్ర

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.