close

ప్రధానాంశాలు

పల్లె ప్రగతిలో జరిమానాలూ కీలకం

 మంత్రి దయాకర్‌రావు స్పష్టీకరణ
 కొత్త పీఆర్‌ చట్టంపై అదనపు కలెక్టర్లకు అవగాహన సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలంటే కొన్ని సందర్భాల్లో జరిమానాల విధింపూ తప్పనిసరని, అదనపు కలెక్టర్లు దీనినీ ప్రాధాన్యాంశంగా పరిగణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. పల్లెప్రగతిలో దాతల నుంచి విరాళాల సేకరణ సహా మొత్తం 10 అంశాలపై కీలకంగా దృష్టిసారించాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు నిధుల కొరత లేదని, పల్లెప్రగతిని విజయవంతం చేసే బాధ్యత అదనపు కలెక్టర్లదేనని మంత్రి స్పష్టంచేశారు.
జిల్లాలవారీగా అదనపు కలెక్టర్లకు స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వారికి హైదరాబాద్‌లో గురువారం నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘గ్రామాల ప్రగతికి సహకరించని వారికి చట్టం కొన్ని రకాల జరిమానాలను నిర్దేశించింది. వాటి విధింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. జరిమానాలు సహా పది అంశాలైన.. శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు, ఉపాధిహామీ, దాతల నుంచి విరాళాల సేకరణ, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, భగీరథ నల్లాలను పరిశుభ్రంగా ఉంచటం, వాల్టా చట్టం అమలుపై అదనపు కలెక్టర్లు దృష్టిపెట్టాలి. భగీరథను రూ.45 వేల కోట్లతో అమలు చేస్తున్నాం. పథకంపై పూర్తి పర్యవేక్షణ పెడితే, తాగునీటి సరఫరా ఖర్చు భారం పంచాయతీలపై పడదు. పల్లె ప్రగతిని అంతా తమదైన కార్యక్రమంగా పరిగణించాలి. రానున్న 25 రోజుల్లో రాష్ట్రంలో స్పష్టమైన మార్పు వచ్చేలా కృషి చేయాలి’’ అని కోరారు. సదస్సులో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎంసీహెచ్‌ఆర్‌డీ అదనపు డైరెక్టర్‌ బెనహర్‌దత్‌ ఎక్కా, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.