close

ప్రధానాంశాలు

మాపై అనుమానపు చూపులా?

వైద్య సిబ్బంది ఆవేదన

ఈనాడు- హైదరాబాద్‌:  కరోనా బాధితులకు చికిత్సలో రేయింబవళ్లు శ్రమిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది...తమను అందరూ అనుమానంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందేమోనని ఎక్కడికక్కడ స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేయడం తగదని వారు కోరుతున్నారు. వరంగల్‌లో పీజీ వైద్యులకు ఎదురైన ఈ తరహా సంఘటనను  భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ రఘురాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని రఘురాం తెలిపారు. ‘ఈ సమయంలో వైద్యుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దు. వారిని మనం కాపాడుకోవాలి’. అని తెలంగాణ రెసిడెంట్‌ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ కోరారు. వైద్యుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని  కాళోజీ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

కఠిన చర్యలకు కేంద్రం ఆదేశం
కరోనా కేసులకు చికిత్స చేస్తున్నవారికి స్థానికుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వైద్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు, నగరపాలక సంస్థల్లో జోనల్‌ డిప్యూటీ కమిషనర్లకు, డీసీపీలకు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.