close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
అంతిమ యాత్రకు ఇద్దరే

నిత్యావసరాలు తెచ్చేందుకు ఒక్కరికే అనుమతి
ఇటలీలో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది
మిలన్‌ నుంచి ‘ఈనాడు’తో చింతాడ రమేశ్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘ఊహకందని ఉత్పాతమిది. గడిచిన ఏడేళ్లలో ఇటలీ ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొంది. బహుశా దేశ చరిత్రలో ఇదే అత్యంత భయంకరమైనది. ఇక్కడి కరోనా వైరస్‌ తీవ్రత గురించి మాటల్లో చెప్పలేం. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రుల్లో చేరటానికి కాదు మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకూ వేచి ఉండాల్సిన పరిస్థితి’ అని ఇటలీలోని మిలన్‌ నగరంలో నివాసముంటున్న విశాఖపట్నానికి చెందిన చింతాడ రమేశ్‌ వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా మనీలాలోని ఓ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మనీలా నుంచి సోమవారం ఆయన ఫోన్‌లో ‘ఈనాడు’తో మాట్లాడారు.

నిత్యావసరాలకు ఒక్కరే రావాలి
‘ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నాం. ఇప్పుడిప్పుడే మృతుల సంఖ్య తగ్గుతోంది. ఇటలీలో పరిస్థితులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఫిబ్రవరి 18న లంబోర్ధిని సమీప ప్రాంతం నుంచి 38 ఏళ్ల వ్యక్తి జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. ఆయనే ఇటలీలో తొలి కరోనా బాధితుడు. వైరస్‌తో చనిపోయిన వారిని ఉంచేందుకు ఆస్పత్రుల్లో స్థలం కూడా కరవైంది. తాత్కాలిక భవనాలను నిర్మించి వాటిల్లో ఉంచారు. అంతిమ సంస్కారాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మృతుల కుటుంబాల నుంచి ఇద్దరు మాత్రమే హాజరుకావాలి. సోమవారం వరకు సుమారు 16 వేల మంది మృత్యువాత పడ్డారు. క్యూబా, రష్యా, అల్బెనియా దేశాల వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇటలీలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలి. అది నిత్యావసర వస్తువులు, ఔషధాల కోసమే. బయట వీధుల్లో నడిచినా మనిషి మనిషికి మధ్య మీటరు దూరం ఉండాలి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడంలో ఇటలీ ప్రభుత్వం చురుగ్గా ఉంటుంది. కానీ కరోనా విషయంలో ఇబ్బంది పడింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.