close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలు కదపకుండానే ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

సమాచార విశ్లేషణ ఆధారంగా చిన్నారుల గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రభావంతో ఆపరేషన్‌ ముస్కాన్‌ తీరుతెన్నులు మారిపోయాయి. కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాస్తవానికి తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాలకార్మికులకు పనుల్లోంచి విముక్తి కలిగించేందుకు జులై నెలంతా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌-6’ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సారి క్షేత్రస్థాయికి వెళ్లకుండా.. గతంలో తప్పిపోయిన చిన్నారుల వివరాల్ని సేకరించడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేయాలని మంగళవారం జరిగిన సమీక్షలో పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, మహిళా శిశు సంరక్షణ విభాగం కమిషనర్‌ దివ్య, సంయుక్త కమిషనర్‌ గంగాధర్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ సంయుక్త సంచాలకుడు సత్యనారాయణరెడ్డి  సంబందిత పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వాతిలక్రా మాట్లాడుతూ.. ఈ సారి దర్పణ్‌ యాప్‌లో వివరాల్ని నమోదు చేయడంతోపాటు సీసీటీఎన్‌ఎస్‌, చైల్డ్‌ పోర్టళ్లలోని వివరాల సేకరణపై దృష్టి సారిస్తామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.