close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణలో ఆకలి చావుల్లేవు

 హైకోర్టు వ్యాఖ్య
నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వినియోగంపై నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఆకలి చావుల్లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర నిర్మాణ కార్మికులు ఆకలి చావుల బారిన పడ్డారన్న వాదనలో వాస్తవం లేదంది. మహబూబ్‌నగర్‌కు చెందిన భారత్‌ భవన, ఇతర నిర్మాణ కార్మికుల యూనియన్‌ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ రంగంలోని వారికి నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ద్వారా సాయం అందించాలని పిటిషనర్‌ కోరారు. మార్చి నుంచి మే వరకు నెలకు రూ.5 వేల చొప్పున రూ.15 వేలు చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ, కార్మికశాఖ, రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, రాష్ట్ర భవన, నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.
జర్నలిస్టు వినతి పత్రాన్ని పరిష్కరించండి: హైకోర్టు
కరోనా సమయంలో ఇబ్బందులెదుర్కొంటున్న  న్యాయవాదులకు రూ.25 కోట్ల సాయం అందించినట్లే జర్నలిస్టులకూ అందజేయాలంటూ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన జర్నలిస్టు ఎం.సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ చేపట్టారు. ‘‘జర్నలిస్టులు కొందరు కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉన్నారు. ఓ జర్నలిస్టు సరైన వైద్యం అందక చనిపోయారు. జర్నలిస్టులకు నిత్యావసర సరకులతోపాటు ఆర్థికసాయం అందించండి’’ అని వినతి పత్రం సమర్పించామని పిటిషనర్‌ తరఫున్యాయవాది వివరించారు. తగిన నిర్ణయం తీసుకుని ఆ వినతి పత్రాన్ని పరిష్కరించాలంటూ న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.