close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హరితహారానికి యాప్‌న్నహస్తం

రామగుండంలో ప్రత్యేక పర్యవేక్షణ

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘హరితహారం’ పర్యవేక్షణలో రామగుండం నగరపాలక సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులు, అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు నగర పాలక కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ ‘ప్లాన్‌-టి’ పేరిట మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ఈ సీజన్‌లో నేటి వరకు 14,500 మొక్కలు నాటగా వాటిని ఈ యాప్‌ ద్వారానే పర్యవేక్షిస్తున్నారు. రామగుండం నగరపాలక ప్రాంతంలో మొక్కలు నాటేందుకు వీలైన ఖాళీ ప్రదేశాలను గుర్తించి జియో ట్యాగింగ్‌ విధానంలో యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ ప్రకారంగా ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. రోజువారీగా హరితహారంలో నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు కమిషనర్‌ ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నారు.  మొక్కలు నాటడం, సంరక్షించడంలో ఎప్పటికప్పుడు కచ్చితమైన వివరాలను తెలుసుకుంటూ పర్యవేక్షించేందుకు ఈ ‘యాప్‌’ ఎంతగానో దోహద పడుతోందని నగరపాలక కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.