close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీసీఎంబీ పరిశోధన కేంద్రానికి మార్గం సుగమం

భువనగిరి మండలంలో భూసేకరణకు ప్రభుత్వం ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో ప్రతిష్ఠాత్మక సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధన కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్‌- భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారి సమీపంలో కేంద్రం నిర్మాణానికి అవసరమైన 48 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. భూ సేకరణ, పరిహారం పంపిణీ చట్టం-2016 (2013 చట్టానికి సవరణ) కింద సేకరణకు సంబంధించి మినహాయింపులు వర్తింపజేయాలంటూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ కేంద్రం డైరెక్టర్‌ ప్రభుత్వానికి విన్నవించడంతో నిర్ణయం తీసుకుంది.

బీబీనగర్‌ నుంచి భువనగిరికి మార్పు
హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌ రోడ్డులో ఉన్న సీసీఎంబీ కేంద్రాన్ని విస్తరించే క్రమంలో బీబీనగర్‌లో పరిశోధన కేంద్రాన్ని నిర్మించాలని తొలుత భావించారు. స్థలం లభ్యత విషయంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భువనగిరి మండలంలో బొమ్మాయిపల్లి గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 85లో 41 ఎకరాలు, పగిడిపల్లి గ్రామ పరిధిలో 86 సర్వే నెంబరులో 79 ఎకరాల భూమి అనువుగా ఉంటుందని యాదాద్రి   జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రకటన వెలువడింది. ఈ కేంద్రంలో పరిశోధనలకు సంబంధించిన భవనాలు, ల్యాబ్‌లను సీసీఎంబీ ఏర్పాటు చేయనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.