close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పునఃమూల్యాంకనం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబు పత్రాల పునఃమూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. కరోనా కారణంగా సబ్జెక్టు నిపుణులు ఇంటర్‌బోర్డుకు వచ్చి మూల్యాంకనం చేసే పరిస్థితి లేకపోవడం, ఇంటర్‌బోర్డులో పలువురు ఉద్యోగులు కరోనా బారినపడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జవాబుపత్రాల పునఃమూల్యాంకనానికి  59,651, పునఃలెక్కింపునకు 14,333 దరఖాస్తులు అందాయి. ఈ విధానంలో.. అధికారులు జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి సబ్జెక్టు నిపుణుల ఇళ్లకే పంపిస్తారు. వాటిని వారు పరిశీలించి బోర్డుకు పంపిస్తే.. బోర్డు అధికారులు వాటిని మళ్లీ మరో నిపుణుడికి పంపిస్తారు. ఇలా.. ఈ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేసి కొత్త మార్కులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.