close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఖైదీలకు రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌

మూడు గంటలకోసారి బ్యారెక్స్‌ శుభ్రం
కొత్తగా వచ్చే వారు ఐసోలేషన్‌కు
కరోనా కట్టడిలో తెలంగాణ జైళ్ల శాఖ సఫలం

ఈనాడు, హైదరాబాద్‌: ఖైదీలకు నిత్యం రెండు విడతలుగా థర్మల్‌ స్క్రీనింగ్‌.. మూడు గంటలకోసారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో బ్యారెక్స్‌ శుభ్రం.. వారానికోమారు జైలు ఆవరణ అంతా శానిటైజేషన్‌.. కొత్తగా జైళ్లలోకి వచ్చే ఖైదీలకు కనీసం 14 రోజులపాటు ప్రత్యేక ఐసోలేషన్‌.. ఇవీ కరోనా కట్టడిలో తెలంగాణ జైళ్ల శాఖ అనుసరిస్తున్న పద్ధతులు. కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ముందు నుంచే ప్రత్యేక ప్రణాళిక అనుసరించడంతో ఇప్పటివరకు జైళ్లు సురక్షితంగా ఉన్నాయి.  పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌.. తదితర రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌ సోకడం గమనార్హం.

ప్రవేశాల సమయం నుంచే కట్టడి: తెలంగాణలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌ కేంద్ర కారాగారాలతోపాటు 7 జిల్లా కారాగారాలు, 34 సబ్‌జైళ్లు, ఒక మహిళా కారాగారం(చంచల్‌గూడ) ఉన్నాయి. వీటిలో దాదాపు 6వేల మంది ఖైదీలున్నారు. జైళ్లలో కరోనా కట్టడికి తెలంగాణ జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది ముందు నుంచే ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారు. ఖైదీలను కుటుంబసభ్యులు కలిసేందుకు ఉద్దేశించిన ములాఖత్‌లను ఆదిలోనే రద్దు చేశారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని జైళ్లలోని ఖైదీలకు వాటిని ముందుగానే సరఫరా చేశారు. కొత్త ఖైదీలు కారాగారంలోకి రాగానే వేడి నీటితో స్నానం చేయాలనే నిబంధన పెట్టారు. తర్వాత వారిని ప్రత్యేక బ్యారెక్స్‌ల్లోనే మొదటి 14 రోజులపాటు ఇతర ఖైదీలను కలవనీయకుండా ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. జైళ్లలోని ఖైదీలందరూ ప్రతి రెండు గంటలకోసారి శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను శుభ్రపర్చుకునేలా సమాయత్తం చేశారు. అందరు ఖైదీలకు రోజు విటమిన్‌-సి, డి తదితర ఔషధాలను ఇస్తుండటంతోపాటు ఉప్పు కలిపిన వేడినీటితో నోరు పుక్కిలించడంలాంటి నివారణ చర్యల్ని అమలు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను పరిశీలించే బాధ్యతలను వార్డర్లకు అప్పగించి రిజిస్టర్లలో నమోదు చేయిస్తున్నారు. వారానికోసారి అగ్నిమాపక శాఖ వాహనాలను జైళ్లలోకి రప్పించి ఆవరణ అంతా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.

ఖైదీల వ్యక్తిగత క్రమశిక్షణతోనే సాధ్యమైంది: రాజీవ్‌ త్రివేది, జైళ్ల శాఖ డీజీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం ఖైదీల వ్యక్తిగత క్రమశిక్షణతోనే సాధ్యమైంది.  ఖైదీలు సైతం పరిశుభ్రత పాటించడం అలవాటు చేసుకున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.