close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ సీఎంవోలో శాఖలన్నీ ముగ్గురికే...

ప్రవీణ్‌ ప్రకాష్‌కు అగ్రాసనం
అజేయ కల్లం శాఖలన్నీ తొలగింపు

ఈనాడు, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు పర్యవేక్షించే శాఖల్ని పునర్విభజించారు. మొత్తం శాఖల్ని ముగ్గురు అధికారులకే పంచారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు అగ్రాసనం వేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షణ సహా, చాలా ప్రధానశాఖలను ఆయనకే కేటాయించారు. మిగతా వాటిని ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌కు, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డికి కేటాయించారు. ఈ మేరకు ప్రవీణ్‌ ప్రకాషే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల కేటాయింపునకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నీ రద్దవుతాయని అందులో తెలిపారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు సహా ప్రధాన శాఖలు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, అదనపు ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్‌, అదనపు కార్యదర్శి జె.మురళిలకు ఎలాంటి శాఖలనూ కేటాయించలేదు. వారు ముగ్గురూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారులే. వారితోపాటు సీఎంకు ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆర్థిక, ఇంధనశాఖల వ్యవహారాలు చూస్తున్న దువ్వూరి శ్రీకృష్ణ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌, జనరల్‌ గ్రీవెన్సెస్‌ను చూస్తున్న ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డా.ఎం.హరికృష్ణల ప్రస్తావనా తాజా ఉత్తర్వుల్లో లేదు.

వారికి వేరే బాధ్యతలు?
అజేయ కల్లం, పి.వి.రమేశ్‌, మురళిలకు ఎలాంటి శాఖలూ కేటాయించకపోవడంతో వారికి వేరే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన కార్యాలయ వ్యవహారాలన్నీ అజేయ కల్లం కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే కాకుండా, అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు దాదాపుగా ఆయన పర్యవేక్షణలోనే పని చేసేవారు. హోం, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, న్యాయ, శాసనసభా వ్యవహారాలు, సీఎంఓ వ్యవహారాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను ఆయన చూసేవారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.