close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వాసుపత్రుల్లో సకల సదుపాయాలు

నిబంధనలు పాటించని ప్రైవేటు వైద్యశాలలపై చర్యలు
టిమ్స్‌ను సందర్శించిన ఈటల

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ లేనన్ని సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. 1035 పడకలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రిలో ఎక్కువ మందికి చికిత్స అందించాలని సూచించారు. ఈ వైద్యశాలను మంత్రి ఆదివారం సందర్శించారు. ఫార్మసీ, డైనింగ్‌ రూమ్‌, క్యాంటీన్లను పరిశీలించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారితో వార్డులోకి వెళ్లి మాట్లాడారు. వైద్యులతో పాటు అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బందితో మాట్లాడి, శక్తివంచన లేకుండా రోగులకు సేవ చేయాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్‌ సరఫరా, మందుల లభ్యతకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెమిడెసివర్‌, డెక్సామెథాసోన్‌ సహా ఇతర ఔషధాల నిల్వలు టిమ్స్‌లో తగినంతగా ఉన్నాయని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కె.రమేష్‌రెడ్డి మంత్రికి తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది పని తీరును పరిశీలించేందుకు ఆర్‌ఎంఓను నియమించి, ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదుల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని మంత్రి ఈటల తెలిపారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలథామస్‌, సీనియర్‌ హెల్త్‌ ఆఫీసర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.