close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భద్రంగా ఉండండి బంగారం !

ఆన్‌లైన్‌లో మహిళల భద్రతకు ‘బంగారు నిబంధనలు’ సూచించిన డీజీపీ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్నెట్‌ వినియోగంలో మహిళలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి కొన్ని సూచనలు చేశారు. వీటిని ‘బంగారు నిబంధనలు’గా  పేర్కొన్న ఆయన ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిన నేపథ్యంలో మహిళలు, పిల్లలు సైబర్‌ నేరాల బారినపడకుండా చైతన్య పరిచేలా మహిళా భద్రతా  విభాగం ప్రత్యేకంగా ‘సైబ్‌హర్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృష్టా డీజీపీ ఈ సూచనలు చేశారు.
డీజీపీ చేసిన సూచనలు
* ఆన్‌లైన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ వ్యక్తిగతసమాచారం ఇవ్వవద్దు.
* ఆన్‌లైన్‌లో వ్యక్తులు తమ గురించి చెప్పుకునేదంతా నిజం కాకపోవచ్చన్న విషయం గుర్తుంచుకోవాలి.
* ఎవరైనా సైబర్‌ నేరానికి పాల్పడుతున్నట్లు గమనిస్తే ఆ ఖాతాను బ్లాక్‌ చేసే బదులు దాన్ని గమనిస్తూ ఉండటంతోపాటు ఫిర్యాదు చేయాలి.
* అవసరం లేని ఫొటోలేవీ ఎవరికీ పంపవద్దు.
* అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్‌, ఎటాచ్‌మెంట్లు తెరవద్దు.
* ఆన్‌లైన్‌లో పరిచయం ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవద్దు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.