close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్త్రీనిధి రుణాల పర్యవేక్షణకు బ్లాక్‌చైన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వయంసహాయక బృందాల స్త్రీనిధి రుణాల మంజూరు, చెల్లింపులు, రేటింగ్‌ను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించనుంది. తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ ప్రాజెక్టు అమలు చేయనుంది. ఈమేరకు బ్లాక్‌చైన్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీనిధి ట్రాన్సాక్షన్స్‌ ఫర్‌ స్త్రీనిధి (బీ-పోస్ట్‌) అప్లికేషన్‌ను ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ప్రారంభించారు. ఈ టెక్నాలజీ ఆధారంగా స్త్రీనిధి రుణాల చెల్లింపు, మంజూరును బ్లాక్‌ చైన్‌ రికార్డు చేస్తుంది. బ్లాక్‌చైన్‌ లావాదేవీల ద్వారా సభ్యుల క్రెడిట్‌ రేటింగ్‌ నిర్ధారణ అవుతుంది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ కాగ్నిటోచైన్‌ అమలు చేయనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.