close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రామకృష్ణ పిటిషన్‌పై.. కౌంటర్‌కు ఏపీ హైకోర్టు అనుమతి

 విచారణ సోమవారానికి వాయిదా

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టును కరోనా రెడ్‌ జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ న్యాయాధికారి ఎస్‌ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ వేసేందుకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థి సమాఖయకు హైకోర్టు అనుమతిచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు హైకోర్టు తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) తాజాగా ఈ వ్యవహారంలో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారని దానిని అనుమతించాలని కోరారు. అందుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. దీంతో అ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది.. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన వ్యాజ్యం వెనుకు జస్టిస్‌ ఈశ్వరయ్య హస్తం ఉందని రామకృష్ణ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని సాక్ష్యాలు కోర్టుముందు ఉంచేందుకు అనుమతివ్వాలని ఆయన అభ్యర్థించారు.
ఆరోపణల్ని కొనసాగనిస్తే న్యాయపరిపాలన బలహీనపడుతుంది: రామకృష్ణ తరపు న్యాయవాది
న్యాయాధికారి రామకృష్ణ తరఫున న్యాయవాది జార్జి పూన్‌తొట్టమ్‌ శుక్రవారం జరిగిన విచారణలోవాదనలు వినిపిస్తూ జస్టిస్‌ ఈశ్వరయ్య న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై ఆరోపణలు చేశారన్నారు. అలాంటి ఆరోపణలతో న్యాయపరిపాలన బలహీనపడుతుందన్నారు. అనుబంధపిటిషన్ల విచారణకు స్వీకరణపై అభ్యంతరం ఉందా అని ఏజీని ధర్మాసనం కోరగా లేదని బదులిచ్చారు. విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది కె.అశోక్‌రెడ్డి తమకు అభ్యంతరం ఉందన్నారు. కౌంటర్‌ దాఖలకు గడువు కోరారు. అంగీకరించిన ధర్మాసనం వివరాలను వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేసేలా పోస్టులు: తాజా అఫిడవిట్‌లో ఆర్‌జీ
‘రాజకీయ ప్రయోజనం పొందాలని పిటిషన్‌ను అసోసియేషన్‌ పేరుతో దాఖలు చేశారు. పంచాయతీ కార్యాలయాలకు అధికారపార్టీ జెండా రంగులు, అన్ని పాఠశాలల్ని ఆంగ్లమాధ్యమంలోకి మార్చడం తదితర విషయాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సామాజిక మాధ్యమాల్లో కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. ప్రస్తుత ఎంపీలు, అధికారపార్టీ మాజీ ఎమ్మెల్యే, మరికొందరు న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేసేలా పోస్టులు పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తులపై విమర్శలు చేసినందుకు హైకోర్టు సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్‌లను నిలువరించేందుకు కేంద్రం మార్గదర్శకాలు రూపొందించేలా హైకోర్టు ఇన్‌స్టిట్యూషనల్‌ హోదాలో మరో వ్యాజ్యం దాఖలు చేసింది’ అని  ఆర్‌జీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.