close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఆయన సొంతం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1958లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన సర్పంచి స్థాయి నుంచి పలు ఉన్నత పదవులను అధిరోహించారు. 1967 నుంచి 2004 వరకు వరుసగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1994 మినహా ఆయన 8సార్లు గెలుపొందారు. గజపతినగరం, సతివాడ నియోజకవర్గాల నుంచి శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా, ఆ తర్వాత ఏడు సార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీపడ్డారు. 1989-94లో రాష్ట్ర పౌరసరఫరాలు, రవాణా మంత్రిగా సేవలందించారు. తితిదే పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. ప్రొటెం స్పీకర్‌గా రెండు సార్లు వ్యవహరించారు. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలకు పెనుమత్స రాజకీయ గురువు. ప్రస్తుతం వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యం, వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అధికార లాంఛనాలతో స్వగ్రామం మొయిదలో సాంబశివరాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఏపీ సీఎం జగన్‌ నివాళులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెనుమత్స సాంబశివరాజు అని సీఎం జగన్‌ కొనియాడారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.