close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
15 నాటికి 10,915 ప్రజా మరుగుదొడ్లు  

నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరాలు, పురపాలక పట్టణాల్లో ఈ నెల 15వ తేదీ నాటికి 10,915 ప్రజా మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తాయని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రకటించారు. ప్రతి వెయ్యిమందికి ఒక ప్రజా మరుగుదొడ్డి సముదాయం నిర్మించాలనే కార్యాచరణతో ఈ కార్యక్రమం అమలవుతోందని తెలిపారు. కొత్తగా నిర్మించే వాటిలో 50 శాతం మహిళల కోసం కేటాయించనున్నట్టు తెలిపారు. ‘హైదరాబాద్‌ నగరంలోనే 7,065 అందుబాటులో వస్తాయి. వీటిలో 20 శాతం బీవోటీ విధానంలో నిర్మించినవి. మిగిలినవి నిర్వహణ విధానంలో ఉంటాయి. 139 నగరాలు, పురపాలక పట్టణాల్లో 3,850 మరుగుదొడ్ల నిర్మాణం 15వ తేదీ లోపు పూర్తవుతుంది. నిర్మాణ నమూనా ఆధారంగా ఒక్కో దానికి రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షలు వ్యయం చేస్తున్నాం’  అని అర్వింద్‌కుమార్‌ తెలిపారు.
అందుబాటులోకి వచ్చే ప్రజా మరుగుదొడ్లు
జీహెచ్‌ఎంసీ: 7,065

వరంగల్‌ కార్పొరేషన్‌: 264
నిజామాబాద్‌ కార్పొరేషన్‌: 247
ఖమ్మం కార్పొరేషన్‌: 151

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 105
మహబూబ్‌నగర్‌: 151 నల్గొండ: 126
మిగిలిన పురపాలక సంఘాలు: 2,806

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.